కాకినాడ ముత్తాక్లబ్‌లో పవన్ కల్యాణ్ ముస్లిం ప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దేశంలో సమాజం వేరు, రాజకీయ పార్టీలు వేరని, మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలుండవనే భావన మన మనస్సుల్లోంచి తొలగించాలని కోరారు. 2019 ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఉభయసభల్లో కలిపి ఆ పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం వంచుతున్నాడో, ఎవరు వంచుతున్నారో తెలిసిందేనన్నారు. బీజేపీ అడిగినా అడగకపోయినా ఉభయ సభల్లో ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. దాంతో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తాను వైసీపీలా గుడ్డిగా బీజేపీకి ఒత్తాసు పలకడం జరగదని స్పష్టంచేశారు. మీకు ఆ విషయం నిలకడగా తెలుస్తుందన్నారు. కాగా జనసేన మేనిఫెస్టోలో సచార్ కమిటీ సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రతీ అంశం అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ పీఏసీ రాష్ట్ర చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమల్ సమన్వయకర్తగా వ్యవహరించారు. పార్టీ నేతలు అర్హంఖాన్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, ముత్తా శశిధర్‌లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa