ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ. కె. త్రిపాఠి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖ- (08579) రైలు జులై 5 నుంచి 26 వరకు సికింద్రాబాద్ ప్రతి బుధవారం సికింద్రాబాద్-విశాఖ(08580) రైలు జులై 6 నుంచి 27 వరకు ప్రతి గురువారం నడుస్తాయన్నారు. విశాఖ-మహబూబ్ నగర్ (08585) రైలు జులై 4నుంచి 25 వరకు ప్రతి మంగళవారం మహబూబ్ న గర్-విశాఖ (08586) రైలు జులై 5 నుంచి 26 వరకు ప్రతి బుధవారం విశాఖ-తిరుపతి(08583) రైలు జులై 3 నుంచి 31 వరకు ప్రతి సోమవారం తిరుపతి- విశాఖ(08584) రైలు జులై 4 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్-తిరుపతి(02809) రైలు జులై 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం తిరుపతి-భువనే శ్వర్(02810) రైలు జులై 2 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa