కోసిగి మండలంలో వర్షం కురవాలని కోరుతూ చిన్నారులు బుధవారం కప్పకు పూజలు చేపట్టారు. కప్పను పట్టుకొని కర్రకు వేపాకుతో కలిపి కట్టి ఇంటింటికి తిరిగారు. ఇళ్ళ వద్దకు వెళ్లగా మహిళలు , చిన్నారులు చెంబుతో కప్పకు నీళ్లు పోసి కుంకుమ అంటించి పూజలు చేపట్టారు. వర్షం సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని రైతుల కష్టాలు నుంచి గట్టెక్కాలని ఇలా చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa