విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జూన్ 22న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు కర్ణాటక పరిశ్రమల సంఘం (కేసీసీఐ) పిలుపునిచ్చింది.మరోవైపు బంద్‌పై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ఆందోళనలపై పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చిస్తామన్నారు. వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు తగ్గుతాయని అన్నారు. అంతకుముందు, గృహ జ్యోతి పథకం కింద రెండు కోట్ల మంది కర్ణాటక ప్రజలు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ బుధవారం తెలిపారు. సగటు విద్యుత్ వినియోగంలో 10 శాతంతో పాటు 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వినియోగదారులు ఈ పథకాన్ని పొందేందుకు అర్హులని, కేటాయించిన యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వినియోగదారులు అదనంగా వినియోగించిన యూనిట్లకు 9 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.