భారీ వర్షాలతో అసోం కుదేలవుతోంది. వరద ముప్పు మరింత తీవ్రమైంది. ఇప్పటికే పది జిల్లాలలో 1.20 లక్షల మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారని అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్బరి జిల్లాలో 45 వేల మంది, బస్కా జిల్లాలో 26 వేల మంది, లఖింపూర్ జిల్లాలో 25 వేల మంది నీటిలో చిక్కుకున్నారు. 780 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ తదితర విభాగాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.