జగన్ ప్రభుత్వం ప్రజానీకంపై విద్యుత్ భారాలు మోపడం బాధాకరమని కేంద్రంలోని బీజేపీ వంత పాడడం దారుణమని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బద్వేలు సీపీఐ కార్యాలయంలో బుధవారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, చాంద్‌బాష, పిచ్చయ్య, చిన్నయ్య, పివి.రమణ, తదితర ప్రజాసంఘాల నాయకులు, విద్యార్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.