ఉపాధ్యాయులకు లెసన్ ప్లాన్ తప్పనిసరి అని కడప కమిషనర్ ప్రవీణ్‌చంద్ సూచించా రు. ప్రతి విద్యార్థిపై విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించారు. నగర మున్సిప ల్ హైస్కూలు (మెయిన్)ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ... విద్యాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రభుత్వం చేపట్టిందని, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికీ అవసరమైన అన్ని వస్తువులు అందించాలన్నారు. ప్రభుత్వం అందించిన కిట్లతో సమయపాలన పాటిస్తూ విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలన్నారు. టెన్త్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంవత్సరం ప్రారంభం ముందే ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. అనంతరం టాయిలెట్ల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నాగమణి పాల్గొన్నారు.