కుటుంబ సభ్యుల కిడ్నప్ పై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. రౌడీలు కేవలం డబ్బు కోసమే తన భార్య, కుమారుడు, స్నేహితుడైన ఆడిటర్ జీవీని కిడ్నాప్ చేశారని తెలియజేసారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ, రియల్ ఎస్టేట్ వివాదాలు లేవన్నారు. తన కుటుంబ సభ్యులు చావు నుంచి తప్పించుకొని వచ్చారని, ఇటువంటి సమయంలో సానుభూతి చూపకుండా అనుమానాలు వ్యక్తం చేయడం భావ్యం కాదన్నారు. తాను ఏమి చేసినా రాజకీయంగా బురద జల్లుతున్నారని, అందుకే తాను విశాఖలో ఇకపై వ్యాపారంచేయబోనని, రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పారు. వ్యాపారాన్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేస్తానని, ఇప్పటికే అక్కడ రెండు ప్రాజెక్టులు ప్రారంభించానని తెలిపారు.