కాపులను మోసంచేసి చంద్రబాబుకు ఊడిగం చేసే పనిలో దత్తపుత్రుడు ఉన్నాడని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ ఆత్మహత్య దిశగా పవన్‌కళ్యాణ్ పయనిస్తున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిత్యం పిచ్చి వ్యాఖ్యలతో గ్రాఫ్ దిగజారిపోవడంతో పాటు, రాజకీయాల్లో మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ వ్యక్తిగా పవన్ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ‘పవన్ నువ్వు ఎక్కింది వారాహి కాదు పందిని. ఆ పందిపై తిరుగుతూ నీపై నువ్వే బురద చల్లుకుంటున్నావు. నీ పిరికితనం తప్ప.. నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి. అసలు నీస్థాయి ఎంత.. నువ్వు గెలిచిన సీట్లు ఎన్ని. నీ మాటలు చాలదా.. ఒకడు నిన్ను చంపాలా? నీ వ్యాఖ్యలతో నువ్వే రాజకీయంగా చచ్చిపోయేలా ఉన్నావు. నీకే నమ్మకం లేని ఎన్నికలకు నువ్వే ప్రచారం చేసుకోవడం చూస్తే నవ్వొస్తోంది. ఒకవేళ నిన్ను చంపాల్సి వస్తే.. వంగవీటి మోహనరంగాను హతమార్చిన వాళ్లకే ఆ ఆలోచన ఉంటుంది. నువ్వు చెగువేరా బొమ్మ వేసుకుని ప్రాణహాని గురించి ప్రస్తావించడం సిగ్గుచేటు..’ అని మండిపడ్డారు.