కానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందటంతో పెనమలూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మార్కపూడి రవి (35) గత సంవత్సర కాలంగా కానూరులో వాచ్మాన్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం బందరు రోడ్డు దాటుతుండగా అతనిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన అతనిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.