అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతివనం పనులను మంత్రి మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై అధికారులతో చర్చించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్ వర్కులు అనుకున్న సమయానికి పూర్తవుతాయని తెలిపారు.