2023-24 మొదటి అర్ధ సంవత్సరం ఆస్తిపన్ను అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30వ తేదీ వరకూ చెల్లించే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి నగర కమిషనర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్పెషల్ కౌంటర్, సంబంధిత వార్డు సచివాలయం, ఆన్లైన్, పురసేవ యాప్, చెక్కులు, డీడీల ద్వారా ఆస్తిపన్ను చెల్లించవచ్చని దినేష్ కుమార్ పేర్కొన్నారు.