తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు , ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పోర్టు కార్మికులు, ఉద్యోగులు రైల్వే ట్రాక్స్ పై నిరసన వ్యక్తం చేశారు. బకాయివేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడకు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది