గాజువాక కణితి రోడ్ లైన్స్ క్లబ్ లో నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సమావేశం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ దక్షిణాది రాష్ట్రాల విప్ జీవీఎల్ నరసింహా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవిఎల్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారా ఐదు లక్షల ఆరోగ్య బరోసా ఈశ్రమ్ కార్డు ల ద్వారా అసంఘటిత కార్మికులకు బరోస, పేదలకు ఇల్లు , ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కరోనా సమయంలో ఉచితంగా టీకాలు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం, ప్రతి ఇంటికి నీటి కొళాయి వంటి ఎన్నో సంక్షేమ కార్య క్రమాలు ప్రధాని మోడీ ఇస్తుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్ వేసుకుంటున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ లబ్ధి దారులు ఎంపీ జీవీఎల్ సమక్షంలో ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపా ధ్యక్షులు దేవనకొండ కృష్ణరాజు, శశి ధరన్, పిల్లై లలిత, మండల అధ్యక్షులు సోమశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొండా. ఎల్లాజీ రావు, గూటూరు శంకర్రావు, కిలాని ముసలయ్య, ప్రకాష్, నాగేశ్వరరావు కట్టాపద్మ, అప్పలరాజు, భువనేశ్వరి రమణ, రోహిణి, పావని, జ్యోతి, భారతి, రంజిత్ ఏఎన్ఆర్, వెంక ట్రావు, గరికిన పైడ్రాజు, పేర్ల సత్యా రావు, పేర్లఅప్పారావు, లయన్స్ క్లబ్ దాస్, తాతారావు, ప్లీడర్ ఈశ్వర రావు, వెంకట్రావు, సూరిబాబు, సత్తి బాబు, రాజశేఖర్, రామస్వామి తది తరులు పాల్గొన్నారు.