గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వార్డు రాజేందర్ నగర్ కనకమ్మ వారి వీధి లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు 25వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ సారి పిల్లిగోవింద్ తో కలిసి జోరువానలో శనివారం పర్యటించారు. కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో శాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేసిన జగనన్న ప్రభుత్వం ఏ కారణం చేతనైనా పొరపాటున ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలని జగనన్న సురక్ష ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టి మరీ వారికి లబ్ది అందించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, 25వార్డు నాయకులు సానబోయిన సురేష్, బోగవల్లి గోవింద్, సారిపిల్లి సంతోష్, సన్నీ, గోవిందమ్మ, గౌరి సీనియర్ నాయకుల షేఖ్ బాబ్జి, సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.