వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడదని, పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే చదువుతాడనేది అందరికీ అర్థమైపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే తన పవిత్ర కర్తవ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే తాను పనిచేస్తున్నానని పవన్ కల్యాణ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే పవన్ దివాళాకోరుతనం, ఆయన పొలిటీషియన్ కాదు పెయిడ్ ఆర్టిస్టు అనేది అర్థమైపోయిందన్నారు.