ఏపీకి చెందిన 17మంది యూపీఎస్సీ (సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యూపీఎస్సీ ర్యాంకర్లను సీఎం వైయస్ జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచించారు.