సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు తాను సిద్ధమని, లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాలు విసిరారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదు. సోమశిల హైలెవల్ కెనాల్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. శనివారం మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.