ఏపీలో అవినీతి అధికారుల ఆట కట్టిస్తోంది ఏసీబీ. నాలుగైదు రోజులుగా వరుసగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. తాజాగా గుంటూరు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చుంచు ఆంజనేయులు, శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఈబీ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పెద్దకాపు శ్రీనివాసరావు అక్రమ ఆస్తుల్ని గుర్తించారు.
గుంటూరు జిల్లా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న చుంచు ఆంజనేయులు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాదించారని ఏసీబీకి సమాచారం వచ్చింది. ఈ మేరకు ఒంగోలు ఏసీబీ అధికారులు గుంటూరు, ఒంగోలు టౌన్ ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.
సోదాలలో గుర్తించిన ఆస్తుల వివరాలు:
1. ఒంగోలు టౌన్, లంబాడి డొంకలో జి+3 ఇల్లు.
2. ఒంగోలు టౌన్, భాగ్య నగర్‌లో ఒక ఫ్లాట్
3. ఒంగోలు మండలం, కొప్పోలు గ్రామంలో 8 ఇళ్ల స్థలాలు.
4. చీరాల టౌన్‌లో 8 పోర్షన్‌లతో కూడిన ఒక ఇల్లు (జి+1).
5. కొత్తపేట, చీరాలలో రెండు ఇళ్ల స్థలాలు.
6. దైవాల రావూరు గ్రామంలో ఒక ఇల్లు.
7. రెండు కార్లు మరియు రెండు మోటార్ సైకిళ్లు.
8. సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు (ఒంగోలు కెనరా బ్యాంక్).
9. సుమారు 6 కేజీలు మరియు ఎలక్ట్రికల్ గాడ్జెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్.
10. చినగంజాం మండలం, కడవకుదురు గ్రామం వద్ద ఒక ఎకరం, 90 సెంట్లు వ్యవసాయ భూమి కొనుగోలు కోసం 50 లక్షల సేల్ డీడ్ అగ్రిమెంట్ ఉంది.
మున్సిపల్ కమిషనర్ అక్రమాస్తులు రూ.కోట్లలో
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చుంచు ఆంజనేయులు ఇంట్లో ఇప్పటివరకు జరిపిన సోదాలలో ఎలక్ట్రికల్ గాడ్జెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, హౌస్ హోల్డ్, పత్రాలు స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇంకా సోదాలను కొనసాగిస్తున్నారు. సదరు అవినీతి అధికారిని నెల్లూరు ఏసిబి కోర్టులో హాజరు పరిచారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా పొందూరు SEB స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారు. 08-06-2023 ట్రాప్ కేసులో పట్టుబడగా..అక్రమ ఆస్తులు కలిగిఉండటంతో ఆయన ఇల్లుతో పాటు మరో రెండు ప్రాంతాలలో శ్రీకాకుళం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో పెద్ద ఎత్తున విలువైన ఆస్తులను గుర్తించారు.
సోదాలలో గుర్తించిన ఆస్తుల వివరాలు:
1. చోడవరం గ్రామంలో ఒక భవనం.
2. అప్పన్నదొరపాలెం పంచాయతీ, కొత్తవలస మండలం లో రెండు ఖాళీ నివాస స్థలములు.
3. గంభీరం పంచాయతీ, ఆనందపురం మండలం లో ఒక ఖాళీ నివాస స్థలం.
4. అమృతపురం గ్రామం, సబ్బవరం మండలం లో ఒక ఖాళీ నివాస స్థలం.
5. తిరువాడ గ్రామం, మాడుగుల మండలం వద్ద ఒక ఎకరం వ్యవసాయ భూమి.
6. బ్యాంక్ బాలన్స్ రూ. 19,60,583/-
7. బంగారం వస్తువులు సుమారు 83.99 గ్రాములు
8. ఇంట్లో నగదు రూ. 1,97,600/ మరియు ఒక కేజీ వెండి
9. ఇంట్లో ఖరీదైన గృహోపకరణాలు
10. ఒక కారు మరియు ఒక ద్విచక్ర వాహనం.
ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు పాటు అతని తండ్రి, మామగారి ఇంట్లో ఇప్పటివరకు జరిపిన సోదాలలో డ్యాకుమెంట్లు, నగదుతో పాటు బంగారం, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇంకా సోదాలను కొనసాగిస్తున్నారు.