ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో నాంది పడింది. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రత్యేక చర్య తీసుకున్నారు. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షల నిర్వహణ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈటీఎస్ తరపున ఒప్పందంపై సంతకాలు చేసిన ఈటీఎస్ ఇండియాచీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఓమెన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఎంవోయూలు మార్చుకున్నారు.