ఆ పై వాడు తల్చుకొంటే ఏదైనా సాధ్యమే. తాజాగా వైద్య రంగంలో ఓ అద్భుతం చోటుచేసుకొంది. ఓ వృద్ధుడు గర్భం దాల్చాడు. అందులో కూడా వృద్ధుడి కడుపులో కవల పిల్లలు ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇది చూసిన వైద్యులు సైతం నోరెళ్ల బెట్టారు. దాదాపు 36 ఏళ్లుగా ఆ వ్యక్తి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. సంజూ భగత్ అనే 60 ఏళ్ల వృద్ధుడు ఏళ్లుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు. 1999 లో సంజూ భగత్‌కు కొత్త జబ్బు వచ్చింది. అప్పటి నుంచి అతని శరీరంలో మార్పులు సంభవించాయి. 1999 నుంచి అతని పొట్ట ఒక్కటే పెరగడం ప్రారంభించింది. 36 ఏళ్ల క్రితం సంజూ భగత్ సింగ్‌కు అరుదైన వ్యాధి సోకింది. దీని పేరు ఫీటస్ ఇన్ ఫీటూ అనే అత్యంత అరుదైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధినే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారని వైద్యులు తెలిపారు. అయితే తాజాగా అతడు గర్భం దాల్చినట్లు వైద్యులు పరీక్షలు చేసి నిర్ధారించారు.
అయితే సంజూ భగత్ ఇటీవల ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటనగా వైద్యులు అభివర్ణించారు. అయితే దీనిపై వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. సంజూ భగత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. డెలివరీ సమయంలో కవలల్లో ఒక శిశువు మరణిస్తారని తెలిపారు.
సంజూ భగత్.. బాల్యం నుంచే తన బొడ్డు అందరిలా కాకుండా వేరుగా ఉండేదని వైద్యులు వెల్లడించారు. అది కొంచెం ఉబ్బినట్లుగా ఉండేదని పేర్కొన్నారు. ఎప్పుడైతే భగత్ పెరగడం ప్రారంభించాడో.. అతనితోపాటే అతని బొడ్డు కూడా పెరుగుతూ వచ్చిందని తెలిపారు. ఇక భగత్‌కు 20 ఏళ్లు వచ్చేసరికి అది విపరీతంగా పెరగడం ప్రారంభించిందని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి సంజూ భగత్ ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. తన కుటుంబ పోషణ కోసం ఓ వైపు పనిచేస్తూనే.. వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు.