విజయవాడ నగర శివారు చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద నడిరోడ్డుపై ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జక్కంపూడి జేఎన్ఎన్యూ ఆర్ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణి రెండో కుమార్తెతో అల్లుడికి విభేదాలు రావడంతో కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
ఈ క్రమంలో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేష్.. పక్కా పథకం ప్రకారం వారితో మాట్లాడాలంటూ ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిచాడు. ఈ క్రమంలో వచ్చిన వెంటనే ద్విచక్రవాహనంపై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా.. అతను పరారయ్యాడు. ఆ తర్వాత అత్తపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడ్డ నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. అత్త చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విజయవాడలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా.. దారుణంగా హత్యకు తెగబడటం సంచలనం రేపింది.