అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ట్రామా ఎమర్జెన్సీ పై అవగాహన అవసరమని నగర కమీషనర్ త్రివిక్రమ వర్మ పెర్కొన్నారు. ఈ మేరకు కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ట్రామా ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ మేనేజ్ మెంట్ వర్క షాప్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్ అండ్ బి కూడలి హోటల్ మారియట్ లో నిర్వహించి కార్యక్రమానికి నగర కమీషనర్ త్రివిక్రమ వర్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ ప్రమాదాల కట్టడికి అవగాహన అత్యంత అవసరమని ప్రమాదమేదైనా సరైన అవగాహనతో ప్రాణనష్టం కలుగకుండా నియంత్రణ చేయవచ్చని గుర్తు చేసారు.
ఇటువంటి సదస్సును ఏర్పాటు చేసిన కేర్ హాస్పిటల్స్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక బాధ్యతగా పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సదస్సుకు హాజరైన పలు కంపెనీ ప్రతినిధులకు, పాటించవలసిన భద్రత పరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేసారు. స్వయంగా వైద్యులు కావడం వలన ప్రాణరక్షణకు వైద్యులు పడే తాపత్రయాన్ని వైద్యునిగా ఉన్న సమయంలో తాను చూసిన ప్రమాదాల అనుభవాలను సదస్సులో తెలియజేసారు.