మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కు అనకాపల్లిలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, స్వర్గీయ వివి రమణబాబు శత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు , రైతు భారతి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంగళ వాయిద్యాలతో సత్కరించి శాలువా కప్పి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు