ప్రేమ పేరుతో ఓ యువకుడు నట్టేట మునిగాడు. కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయ్, భావన రెడ్డి ఇద్దరూ ప్రేమించుకున్నారు. చిక్బల్లాపూర్ జిల్లా నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్దామని భావన.. విజయ్ను అడిగింది. ప్రేమించిన అమ్మాయే పిలుస్తోందని విజయ్ ఓకే చెప్పాడు. అయితే అక్కడ ఐదుగురితో కలిసి విజయ్ను భావన కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టింది. దాదాపు రూ.21 లక్షలు వసూలు చేసింది. వాళ్ల నుంచి తప్పించుకున్న విజయ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కి‘లేడీ’ని అదుపులోకి తీసుకున్నారు.