డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. మొదటి షెడ్యూలు ప్రకారం సోమవారం నుంచి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ కారణాలు వెల్లడించకుండానే షెడ్యూలును పొడిగించింది. తాజా షెడ్యూలు ప్రకారం జూలై 5 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. 7 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 16న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆ వెంటనే 17 నుంచి విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, తరగతులు కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. కాగా, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే సమయానికి కోర్సులు, కాలేజీల వారీగా ఫీజులు ఎంత అనేది ఖరారు చేసి వారికి చూపించాలి. అది చేయకపోవడం వల్లే కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, షెడ్యూలును వాయిదా వేసిన విషయాన్ని ఉన్నత విద్యామండలి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయలేదు. ఫోన్లకు మెసేజ్‌లు పంపకుండా షెడ్యూలు మార్చిన విషయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి వదిలేసింది.