ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక శాఖ ప్రాజెక్టులపై ఏపీసీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టును నిర్ణీత కాలపరిమితితో పూర్తి చేసేలా చూడాలన్నారు.