దిల్ సే బడా లగ్తా హై అనే డైలాగ్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన యూట్యూబర్ దేవరాజ్ పటేల్ మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హాస్యనటుడు మరియు యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి వేగంగా వెళ్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. యూట్యూబ్‌లో ఆయనకు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ ఆయన మృతి పట్ల ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa