మన దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేలు. నిత్యం మన భారతీయ రైల్వేల్లో 2.3 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 1853 లో ప్రారంభమైన భారతీయ రైల్వేల ప్రస్థానం.. ఈ 180 సంవత్సరాల్లో ఎంతో విస్తరించింది. ప్రస్తుతం భారతీయ రైల్వే లైన్ల పొడవు 1.15 లక్షల కిలోమీటర్లు. ఈ 180 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలు.. రోజురోజుకూ అభివృద్ధి, సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. పొగబండ్ల నుంచి ప్రారంభమై నేటి వందే భారత్.. త్వరలో రానున్న హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల వరకు భారతీయ రైల్వేల ప్రస్థానం నిర్విరామంగా సాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా రైల్వేలు విస్తరించినప్పటికీ ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఇప్పటివరకు రైల్వే లైను లేదు. ఇక్కడ ఇప్పటిదాకా రైలు కూత వినలేదు.
వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా సిక్కింలో ఇప్పటివరకు రైలు గానీ, రైల్వే లైను గానీ లేదు. అయితే దేశంలోని చాలా మందికి ఈ విషయం అసలే తెలియదు. ఇది తెలిశాక ఇంత అత్యాధునిక ప్రపంచంలో ఉన్న మనదేశంలోని సిక్కిం రాష్ట్రానికి రైల్వే లైన్ కూడా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థగా రైల్వేలు ప్రధానంగా నిలుస్తున్నాయి. బస్సు, విమానం, పడవ ప్రయాణాలతో పోల్చితే.. రైల్వే ప్రయాణం అత్యంత చౌకైనది. సులభమైనది.
180 ఏళ్ల భారతీయ రైల్వేల చరిత్రలో ఇప్పటికీ లేర్వేనేటికీ రైల్వే లైన్ లేని రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. అయితే త్వరలోనే ఆ రాష్ట్రంలో కూడా రైలు కూత పెట్టనుంది. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సిక్కింలో అత్యంత వేగంగా రైల్వే లైన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 2024 నుంచి సిక్కింలో రైలు సేవలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదే గనక జరిగితే దేశవ్యాప్తంగా రైల్వేలు విస్తరించనున్నాయి.