శృంగవరపుకోట మండల కేంద్రంలో గల సబ్ జైలును జూనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ సబ్బవరపు వాణి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైలులో ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. అంతర్జాతీయ మాధవి ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జైలులో ఉన్న నిందితులకు అవగాహన కల్పించారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.