జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండటంతో అనారోగ్యానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మంగళవారం భీమవరంలో కొనసాగనున్న వారాహి యాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెదఅమిరంలోని ఓ పంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ విశాంత్రి తీసుకుంటున్నారు.