ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరాజనగర్ జిల్లా హనుర్ మండలం కగ్గలి గుండి గ్రామంలో రాము, లలితల కుమార్తె సుశీల (6) సోమవారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన చిరుత బాలికపై దాడి చేసి దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. బాలిక కేకలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు కర్రలు తీసుకుని పరిగెత్తడంతో చిరుత పరారైంది. బాలికకు చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa