పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసని భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్న్నా పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కాపులను ఆయన తీవ్రంగా అవమానిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముందు జనసేన ఎన్నికల గుర్తు, పార్టీని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్‌కు.. భీమవరంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా తెలియవని విమర్శించారు. ఇక, సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ రాజమండ్రికి వచ్చినా జనం కిక్కిరిసిపోతారని కామెంట్ చేశారు. గోదావరి జిల్లాల్లో రౌడీయిజం అనేది పెద్ద జోక్ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వల్ల ప్రాణహాని ఉందని చెప్పిన విషయం, ఆ సమయంలో పవన్ గన్ పట్టుకుని రౌడీగా వ్యవహరించిన తీరును ప్రజలు మర్చిపోలేదన్నారు.
పీక నొక్కేయడం, గుడ్డలు ఊడదీసి కొట్టడం, మక్కెలు ఇరగదీయడం.. ఇవే పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టో అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కళ్లతో చూస్తున్నారని, అందుకే అభివృద్ధి కనిపించడం లేదని ఫైరయ్యారు.