డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాహన్నాని నడిపితే సెక్షన్ 182 (1) ప్రకారం పది వేలు జరిమానాతో పాటుగా వాహనాన్ని కూడా సీజు చేస్తామని డిటిసి రాజ రత్నం బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం లైసెన్సు లేని వ్యక్తికీ వాహనాన్ని నడపడానికి ఇచ్చిన ఎడల వాహన యజామానికి సెక్షన్ 180 ప్రకారం, ఐదువేలు జరిమానా 3 నెలల జైలు శిక్ష లేదా రెండును విధించబడతాయని తెలిపారు.
అదేవిధంగా లైసెన్సు లేని వ్యక్తి వాహనాన్ని నడిపినటైతే సెక్షన్ 181ప్రకారం ఐదువేలు లు జరిమానా 3 నెలల జైలు శిక్ష లేదా రెండు విధించబడుతుందన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడిపిన వ్యక్తికి మోటారు వాహన చట్టం ప్రకారం మొదటి నేరానికి గాను 6 నెలల వరకు జైలు శిక్ష పది వేలు జరిమానా లేదా రెండు విధించబడతాయని రెండవ సారి మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే పదిహేను వేలు జరిమానా 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా రెండు విధించబడునని తెలిపారు. ఈమేరకు మోటారు వాహన తనిఖీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.