వ్యవసాయ రైతు సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 30వ తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండల వ్యవసాయ రైతు సంఘ నాయకులు జి బలరామ నాయుడు తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో విజయవాడ కార్యక్రమం పోస్టల్ విడుదల కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ డిసెంబర్ ఈ ఏడాది ఏప్రిల్ మే మాసాలు వచ్చిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని దానికి నష్ట పరిహారం చెల్లించాలని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంటల భీమా వడ్డీ రాయితీ పంటలకు మద్దతు ధరలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి భూములకు నీరు అందించాలని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని భూ సమస్యల పరిష్కారం చేయాలని విత్తనాలు ఎరువులు పురుగుమందులు సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన పంటలు పాడు రైతులకు సహకారం అందించాలని కౌలు రైతులను గుర్తించి కౌలు కార్డులు ఇవ్వాలని సహకార సంఘాలను బలోపేతం చేయాలని డిమాండ్లతో విజయవాడలో జరుగుతున్న ధర్నాని రైతులందరూ జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు నాయకులు ఆవు సాంబమూర్తి వెంకట నాయుడు బద్దన బాను మూర్తి నల్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు