శృంగవరపుకోట మండలంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ పనితీరును జిల్లా పరిశీలకులు కల్పన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఇంతవరకు జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా పంపిణీ చేసిన కిట్లు, బయోమెట్రిక్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శృంగవరపుకోట పట్టణంలో గల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల-1ను అలాగే ఎంఆర్సిలో గల స్టాక్ పాయింట్ ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ వర్రి ఆదినారాయణ, ఎం ఈ ఓ లు పెంట సత్యనారాయణ, పాదం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.