అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు సీఎం జగన్ కురుపాం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ..కురుపాం ప్రజల సాక్షిగా "జననేత" పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.మా ఊపిరి ఉన్నత వరకు మీతోనే వుంటాం అన్నారు. మా ప్రాంతం కోసం మేలు చేసిన మీకు అండగా ఉంటాం అన్నారు. మా కుంటుంబం మీరే, మా కురుపాం మీరే, మా నమ్మకం మీరే, మా భవిష్యత్తు మీరే అంటూ ప్రసంగించారు.