భారతదేశ రాజకీయాల్లో తెలుగు బిడ్డగా పీవీ నరసింహారావు ఒక ప్రత్యేకతను చూపించి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెంచారని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా బుధవారం సాలూరు లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ పీవీ 1957 నుండి 77 వరకూ ఉమ్మడి రాష్ట్రం ఎమ్మెల్యే గా పనిచేసి, 1971, 73 లో రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం భూ సంస్కరణల్లో భాగంగా తన వంద ఎకరాలు భూమిని దానం చేసారని, కేంద్రంలో హోంశాఖ మంత్రిగా, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రి గా దేశానికి పేరుతెచ్చారని, ప్రధాన మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ తో కలసి సరికొత్త ఆర్ధిక సంస్కరణలతో భారత దేశం కి సరికొత్త దిశ, దశ ను చూపించారని, ప్రపంచ దేశాలకు దీటుగా ఒక తెలుగువాడు ఆర్ధిక సంస్కరణల పితామహుడు అనే ప్రశంసలు పొందారని, పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడుగా, స్థితప్రజ్ఞతకు చిరునామాగా నిలిచారని కొనియాడారు, రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమం నిర్వహించక పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు, ఈ కార్యక్రమంలో మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు, క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ప్రతినిధి పసుమూర్తి నరేష్, గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రహి, సీతా, షర్మిల తదితరులు పాల్గొన్నారు.