అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లిలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గాల దాడికి సంబంధించిన కేసుల నమోదులో పోలీసులు పక్షపాతం చూపారని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. పరస్పరం దాడి చేసుకున్న టీడీపీ మద్దతుదారులపై 307 సెక్షన కింద కేసు నమోదు చేయగా వైసీపీ వర్గీయులపై మాత్రం 324కింద కేసు నమోదు చేశారన్నారు. ఇరువర్గాలపై ఒకే సెక్షనల కింద నమోదు చేయకుండా పక్షపాతం వహించడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఈ దాడులకు సంబంధించి టీడీపీకి చెందిన 24మంది, వైసీపీకి చెందిన 18మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.