తెలుగుదేశం పార్టీ చేపట్టింది బస్సు యాత్ర కాదు అని అది తుస్సు యాత్ర అని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సెటైర్లు వేశారు. గురువారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు అయన మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల భవిష్యత్తు కు గ్యారెంటీ ఇవ్వని పార్టీ ప్రజలకు ఏమని భవిష్యత్తు కు గ్యారెంటీ ఇస్తారన్నారు. చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో అని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.