ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని మోదీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు పేరుతో దేశంలో మత ఘర్షణలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 'దేశంలో రెండు చట్టాలు ఉండొద్దని మోదీ చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారు. మత ఘర్షణలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు' అని అన్నారు.