అనకాపల్లి దేవదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సుభద్ర బలబద్ర సమేత జగన్నాథ స్వామి , నవరాత్రి ఉత్సవంలో భాగంగా స్థానిక గూడ్స్ రోడ్డు వద్ద ఇంద్రజ్యమ్యహాల్లో కొలువైన జగన్నాథ స్వామి ఈ రోజు గురువారం కల్కివతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతం స్వామి వారు తిరిగి రథయాత్ర ఇంద్రజ్యమ్యహాల్లో నుండి ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు, వైసిపి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
ముందుగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్, 81వ వార్డు ఇన్చార్జ్ పీలా రాంబాబు, ఆలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు, ఆలయ ఈవో కీర్తి ఆదినారాయణ, దేవదాస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ , భక్తులు, పట్టణ సిఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రత ఏర్పటు చేశారు.