రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని అదే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదీప్ రాజ్ అన్నారు. సబ్బవరం మండలకేంద్రం లోని ఆర్ బి కే వద్ద గురువారం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతాంగానికి అవసరమైన వరివిత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన ఇన్పుట్స్ అయిన టువంటి విత్తనాలు, ఎరువులు పురుగుమందులు రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
మండలంలోని అవసరమైన అన్ని రకాల వరి విత్తనాలు దాదాపుగా 100 టన్నుల వరకు రైతాంగానికి సరఫరా చేయడం జరుగుతుంద న్నారు. ఈ విత్తనాల్లో కూడా కేజీకి పది రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తూ 30 కేజీలు బస్తా కు 300 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలుద్వారా అందించే సేవలను రైతులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, మాజీ ఎంపీపీ లు సబ్బవరపు ముత్యాల నాయుడు, ఉమా మహేశ్వరరావు, జిల్లా బీఐ సి సెల్ అధ్యక్షులు కొటానరాము, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ విరోధి చిన్న అప్పల నాయుడు, వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్లు చీపురుపల్లి సూర్యనారాయణ, సబ్బవరపు బుజ్జి, బోకం కాసు బాబు, పిఎసిఎస్ చైర్మన్ శేషు బాబు, మండల వై సి పి పార్టీ అధ్యక్షులు కర్రి బాబు, ఎంపీడీవోబి రమేష్ నాయుడు, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ ఏఈవోలు బాలరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.