నందిగామ గాంధీ సెంటర్ లొ విద్యుత్ చార్జీలు పెంపుప్తె సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నందిగామ కార్యదర్శి కే గోపాల్ మాట్లాడుతూ కరెంట్ బిల్లులతో జనానికి షాక్ తగులుతుందన్నారు. ప్రజల కళ్ళు కప్పి దొడ్డిదారిన సర్దుబాటు చార్జీలు భారం వేసిందని, రానున్న కాలంలో స్మార్ట్ మీటర్లతో మరో ముప్పు పొంచి ఉంటుందన్నారు. సామాన్యులను దోచి కార్పొరేటర్ జేబులు నింపుతున్న కేంద్ర ప్రభుత్వం సర్కార్ మాట తప్పిన జగన్ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసీం, కర్రి వెంకటేశ్వరరావు, జి. గోపినాయుక్ , జంగా దమోదర్ , బి. లాజర్ , షేక్ హస్సన్ , ఉప్పుతోళ్ళ స్వామి, శ్రీను , నాగరాజు పుల్లయ్య. వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు.