అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో సాహితీ ఫార్మా గెట్ వద్ద కార్మిక సంఘాలు శనివారం ఆందోళన దిగారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పరిశ్రమల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని, దీని కారణంగానే శుక్రవారం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగడం. ఇద్దరు కార్మికులు మృతి చెందడం జరిగిందన్నారు. మృతుల కటుంబాలకు న్యాయం చేయాలని, మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.