ఉత్తర నియోజక వర్గం పరిథి వార్డుల వారీగా ధీర్ఘ కాలిక సమస్యలను ప్రజల అభిష్టం మేరకు ఆయా ప్రాంతల్లో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేస్తామని నగర్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిథి నరసింహనగర్ రైతు బజార్ ప్రాంతంలో 3 కొట్ల 29 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు వార్డు కార్పొరేటర్ కంప హనూక్ తో కలిసి శనివారం శంకుస్థాపన చేసారు. ప్రజల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చాలని లక్షంతో విద్య ఉపాధి ఆరోగ్యం కు పెద్ద పెటవేస్తూ పాలనా సాగిస్తున్నారని గుర్తు చేసారు.