గిరి ప్రదర్శనకు సంబందించి జీవీఎంసీ ఆధ్వర్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పెర్కొన్నారు. ఈమేరకు అక్కయ్యపాలెం వద్ద శనివారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమే మీడియాతో మాట్లాడారు ఆదివారం మధ్యాహ్నం నుండి తొలి పావంచ వద్ద ప్రారంభం కానున్న గిరి ప్రదర్శనకు ఇతర రాష్ట్రాల భక్తుల తో పాటుగా వివిద జిల్లాల నుండి సుమారు ఆరు లక్షలకు పైగా భక్తులు హాజరు కానున్నట్లు అంచనా వేశామన్నారు.
భక్తుల నడక యాత్రకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతి పదికన రహదారి నిర్మాణాలు చేపట్టామని వివరించారు. గిరి ప్రదర్శన మార్గం గుండా మంచి నీటి సౌకర్యం, అల్పాహారం, మెడికల్ క్యాంప్, పోలీసు అవుట్ పోస్ట్, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసామన్నారు.
భక్తులకు ముఖ్యంగా మహిళలకు అవగహన కలిగే విదంగా ( కలర్ కోడ్ ) తో మౌలిక వసతులకు సంబందించి ఆయా స్టాల్స్ వద్ద వివిద రంగులతో కూడిన జండాలను ఏర్పాటు చేశామని అందులో పచ్చ రంగు జండా అమర్చిన చోట డస్ట్ బిన్, బ్లు రంగు వద్ద మంచి నీటి సదుపాయం, ఎరుపు రంగు వద్ద మెడికల్ క్యాంప్, తెలుపు రంగు వద్ద పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసామన్నారు. ఏర్పాట్లకు సంబందించి వివిద శాఖల సిబ్బంది తో పాటుగా సుమారు వెయ్యి మంది పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగిస్తున్నామని అన్నారు.