రాంబిల్లి టీడీపీ మండల కార్యాలయంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు రాంబిల్లి క్లస్టర్ -5 బూత్ ఇంచార్జిలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్ కోసం దిశా నిర్దేశం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై, నాయకులపై కక్ష కట్టి వారి ఓట్లను తొలగించే ప్రక్రియ చేస్తుందని దీనిపై ప్రతి కార్యకర్త సమతవంతంగా ఎదుర్కొని దొంగఓట్లు, తొలగించిన ఓట్ల పట్ల పరిశీలన చేయాలని, కొత్త ఓట్ల ప్రక్రియ ప్రారంభించి కొత్త ఓటర్లకు, గ్రామంలో గల కార్యకర్తలకు మహిళలకు మినీ మేనిఫెస్టో భవిష్యత్ గ్యారెంటీ లను ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలని, ప్రభుత్వ తప్పులను బయటికి చూపించి ప్రజలలో మన ప్రభుత్వం వచ్చే విధంగా మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ చోడపిల్లి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహ కార్యదర్శి కసిరెడ్డి ప్రసాద్, చిట్టి బాబు, కర్రి సింహాగిరి ప్రసాద్, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇంచార్జిలు పాల్గొన్నారు.