వర్షాకాలంలో చాలా మంది స్కిన్ అలర్జీలతో బాధపడుతుంటారు. దుమ్ము, కాలుష్యం వల్ల చర్మ సమస్యలు వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను నిపుణులు సూచించారు. టీ ట్రీ ఆయిల్ యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మంపై దురదలను తగ్గిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ని అలర్జీ ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా కూడా ప్రభావాన్ని చూపుతుంది. దురద తీవ్రతను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.