స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెరుకుపల్లి తహసిల్దార్ బి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వాటిని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. మండలంలోని ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించవచ్చన్నారు.